- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
హైదరాబాద్, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ లోపాలను సరిదిద్దాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాద్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడామన్నారు. చాలా కమిషన్లు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయని తెలిపారు. మాదిగల జనాభాకు తగ్గట్లుగానే రిజర్వేషన్ల వాటా ఉండాలని విన్నవించామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన నివేదికలో 9శాతం రిజర్వేషన్లే దక్కుతున్నాయన్నారు. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. 32 లక్షలు ఉన్న మాదిగలకు ఏ ప్రాతిపదికన తీసుకున్నా 11 శాతం రావాలన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్ల పంపిణీలో లోపాలను సరిదిద్దాలని సూచించారు. తమకు రావాల్సిన దానికంటే 2 శాతం తక్కువ ఉన్నాయని తెలిపారు.
