27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ట్రాఫిక్ లో వసూళ్ల పై ఎస్బీ అధికారుల విచారణ

Must read

📰 Generate e-Paper Clip

  • డిజిపి కార్యాలయానికి అధికారి అటాచ్..?
  • ఇద్దరు కానిస్టేబుళ్ల పై వేటు..?

 

నిజామాబాద్,  బతుకమ్మ :  నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో అక్రమంగా వసూళ్లపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. ట్రాఫిక్ లో పనిచేస్తున్న ఒక అధికారి, కోర్టు కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ ద్వారా వసూళ్ల పర్వానికి తెరలేలిపినట్టు సమాచారం. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పనిష్మెంట్ విషయంలో మందుబాబుల నుంచి అదనపు వసూళ్లు చేస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా సైలెన్సర్లను మార్పిడి విషయంలో, నంబర్ ప్లేట్లు, హెల్మెట్లను కొనుగోలు విషయంలో ముందస్తుగా షాపుల యజమానులతో కుమ్మక్కై అదనంగా అక్కడే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలిసిన పోలీస్ కమిషనర్ స్పెషల్ బ్రాంచ్ అధికారుల ద్వారా విచారణ చేసినట్టు తెలిసింది. విచారణ నివేదిక ఆధారంగా ఒక అధికారిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్టు సమాచారం. ఇప్పటికింకా అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేసే అవకాశం ఉంది. ట్రాఫిక్ లో వసూళ్ల పర్వంలో విభేదాలతోని ఈ వ్యవహారం బహిర్గతమైందని ప్రచారం జరుగుతుంది.

More articles

Latest article