జుక్కల్, బతుకమ్మ :
సావర్ గాం గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం గ్రామ సర్పంచ్ ముగుడే కపిల్, ఉపసర్పంచ్ చవాన్ సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు జొన్నలను దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు. రైతులకు ఈ కొనుగోలు కేంద్రం ఎంతో ఉపయోగపడనుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.