29.9 C
Hyderabad

ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు కృషితో శేట్లూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాళోజీ విఠల్‌రావు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ తేజరావు పటేల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రత్యేక చొరవతో గ్రామ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాళోజీ నాగ్‌నాథ్, లక్క మధరావు, లక్క బస్వంత్, సమద్, గంగాధర్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article