28.2 C
Hyderabad

సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి, బతుకమ్మ :  సంగారెడ్డి జిల్లా రాయకోడ్  మండల పరిధిలో పిప్పడు పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.  అయ్యప్ప మాలను ధరించిన రాజు( 36) ఇతర స్వాములతో కలిసి ఓ ఫామ్ హౌస్ లో అయ్యప్ప సన్నిధానం ఏర్పాటు చేసుకున్నారు.  సోమవారం తెల్లవారుజామున నిద్రలేచిన రాజు సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలకృత్యాలకు వెళ్లిన రాజు  చాలాసేపటి వరకు రాకపోవడంతో మిగతా స్వాములు వెళ్లి చూడగా అయ్యప్ప మాల టవల్ తో  ఉరివేసుకున్నట్టు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

More articles

Latest article