నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి అర్బన్ నియోజకవర్గంలో రెండేళ్ల కాలంలో రూ. 130 కోట్ల అభివృద్ధి పనులు చేశానని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎమ్మెల్యేగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సోమవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. .
అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాటతప్పిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన విమర్శించారు. కాంగ్రేస్ పార్టీ అమలు చేయలేని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలేల పరిస్థితి ఘోరంగా తయారైందని, కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరిస్తుందని మండిపడ్డారు. నగరంలో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు 650 లేఖలు ఇచ్చానని, ఇప్పటికి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీ ఆర్ ఎస్ పాలనలో నగరంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేక పోయారని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేవుళ్లపై ఒట్టేసి మాటతప్పిన ఘనత ప్రభుత్వానిదే
