ఆసిఫాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈనేపథ్యంలో కొమురంభీం ఆసిఫాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం రాస్పెల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి బొమ్మెల్ల రాజయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. డబ్బులు లేకపోవడంతో ఓటమి పాలవుతానన్న భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. రాజయ్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో డబ్బుల వరద పారింది. డబ్బులు పంచలేకపోయిన వారు ఓటమి భయంతో ఆందోళన చెందుతున్నారు.