. . . భర్త మృతి
…భార్యా పిల్లల పరిస్థితి విషమం
కోటగిరి, బతుకమ్మ
కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్లాపల్లి ఆబాది గ్రామం వద్ద పోతంగల్ బీర్కూర్ ప్రధాన రహదారిపై ఖాళీ ఇసుక ట్రాక్టర్ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ కుటుంబం ఇంటికి పెద్ధ దిక్కును కోల్పోయింది. బైక్ ను ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి చనిపోగా అతని భార్య ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అదివారం రాత్రి ఇసుక ఖాళీ చేసి పోతంగల్ వైపు అతివేగంతో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను జల్లాపల్లి ఆబాది వైకుంఠధామం వద్ద బలంగా ఢీకొట్టింది. మహరాష్ట్రలోని సాంగ్లీకి చెందిన యాదు (30) ఎత్తొండ గ్రామానికి వలస వచ్చి జీవిస్తున్నారు. ఈ ప్రమాధంలో భార్యా భర్తలు,ఇద్దరు పిల్లలకు బలమైన గాయాలయ్యాయి. బైక్ నడిపే యాదు తలకు ఉన్న హెల్మెట్ సైతం పగిలిపోవటంతో తీవ్ర గాయాలయ్యాయి .వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు అంబులెన్సులో క్షతగాత్రులను బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలై యాదు చనిపోగా అతని భార్య ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వారిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్ర గాయలతో రోడ్డుపై పసిపిల్లలు అల్లాడిపోయిన దృశ్యం కలచివేసిందని స్థానికులు వాపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్, బైక్‌ను స్వాధీనం చేసుకన్నారు.
