28.2 C
Hyderabad

ఆర్మూర్ లో చైన్ స్నాచింగ్ నిందితుల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసులలో నిందితులను అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఏ సి పి వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.నేరానికి పాల్పడిన వారిలో ఆర్మూర్ పట్టణానికి చెందిన ఇద్దరు నిందితులతో పాటు ఒక మైనర్ బాలుడు ఉన్నారు.   ఆదివారం ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం సాయంత్రం ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర నేరస్తులను పట్టుకున్నామన్నారు.వారిని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నట్లు చెప్పారు.నిందితుల వద్ద నుండి మొత్తం 7.5 తులాల బంగారంతో పాటు హోండా యాక్టివా స్కూటీ స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును చేదించిన పోలీసులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Arrest of chain snatching accused in Armour

More articles

Latest article