27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రూరల్ పీఎస్ లో ఇసుక టిప్పర్ల పంచాయితీ?

Must read

📰 Generate e-Paper Clip

రెంజల్, బతుకమ్మ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లను పట్టుకోగా  ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ లో పంచాయితీకి దారి తీసింది.  గురువారం తెల్లవారుజామున నగరంలోని బైపాస్ రోడ్డులో రూరల్ పోలీసులు మూడు ఇసుక టిప్పర్లను పట్టుకుని స్టేషన్ కు తరలించారు. డ్రైవర్లను విచారించగా రెంజల్ కు చెందిన టిప్పర్లుగా నిర్దారణ అయ్యింది. అయితే ఆ టిప్పర్లకు నామమాత్రంగా జరిమానా వేయించి విడుదల చేయించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇందు కోసం ఓ కార్పొరేషన్ చైర్మన్ తో నాయకులు పైరవీలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఇసుక టిప్పర్లకు నామమాత్రంగా జరిమానా విధించి వదిలిస్తే ఇక ఇసుక వ్యాపారుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతుందని ప్రజలు అంటున్నారు.

 

More articles

Latest article