రూరల్ పీఎస్ లో ఇసుక టిప్పర్ల పంచాయితీ?

రెంజల్, బతుకమ్మ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లను పట్టుకోగా  ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ లో పంచాయితీకి దారి తీసింది.  గురువారం తెల్లవారుజామున నగరంలోని బైపాస్ రోడ్డులో రూరల్ పోలీసులు మూడు ఇసుక టిప్పర్లను పట్టుకుని స్టేషన్ కు తరలించారు. డ్రైవర్లను విచారించగా రెంజల్ కు చెందిన టిప్పర్లుగా నిర్దారణ అయ్యింది. అయితే ఆ టిప్పర్లకు నామమాత్రంగా జరిమానా వేయించి విడుదల చేయించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందు కోసం ఓ కార్పొరేషన్ చైర్మన్ తో నాయకులు పైరవీలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది....