ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా…

0 15,626
  • ఖాళీ స్థలంలో ఇసుక డంపులు
  • ఇసుక డంపును సీజ్ చేసిన తాసిల్దార్

 

ధర్పల్లి, బతుకమ్మ : ధర్పల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా యదేచ్చగా కొనసాగుతుంది. ఖాళీ స్థలంలో ఇసుక డంపులను నిర్వహించి మరుసటి రోజున ఇసుక తరలింపులు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని గ్రామాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వడంతో ఇదే అదునుగా చేసుకున్న ఇసుక అక్రమార్కులు ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ధర్పల్లిలో ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. మండల రెవెన్యూ కార్యాలయంలో అధికారులు ఇందిరమ్మ ఇండ్లను పర్యవేక్షించకుండా ఇష్టానుసారంగా అనుమతులు జారీ చేయడంతో అక్రమ ఇసుక రవాణా దారులు ఇసుక తరలించడంలో వెనుకడుగు వేయడం లేదు. అధికార యంత్రాంగం కార్యాలయాల ముందు నుండే యదేచ్చగా అక్రమ ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్న ఈ అక్రమ ఇసుక ట్రాక్టర్లను పట్టుకునే నాధుడే కరువయ్యారు. ఇట్టి విషయంపై రెవెన్యూ అధికారినిని వివరణ కోరగా అక్రమంగా ఇసుక తరలింపులు చేపడితే పోలీసు అధికారులు రోడ్డుపై వెళ్లే ట్రాక్టర్లను పట్టుకోక ఎందుకు చోద్యం చూస్తున్నారని అన్నారు. అక్రమ ఇసుక డంపులు చేపట్టే ట్రాక్టర్లపై  చర్యలు తీసుకోవడం లేదని పోలీసు అధికారులపై మండి పడ్డారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన వివరణ మేరకు స్థానిక పోలీసు అధికారినిని వివరణ కోరగా రెవెన్యూ అధికారులు చెప్పకుండ ఇసుక ట్రాక్టర్లపై మేము ఎలాంటి చర్యలు తీసుకోము అని చెప్పడం ఇలా ఒకరిపై ఒకరు చెప్పడంతో ధర్పల్లి మండలంలో యదేచ్చగా అక్రమ ఇసుక తరలింపులు చేపట్టడానికి కొదువే లేకుండా పోయింది. ఇందిరమ్మ పేరుతో ఇసుక డంపులు, రాత్రుల్లో ప్రైవేట్ వ్యక్తుల మయం ఇదే ధర్పల్లిలో కొనసాగుతున్న తతంగం. మండల రెవెన్యూ అధికారులు ఒకసారి ఇసుక అనుమతులు ఇచ్చాము అని మరొకసారి ఎలాంటి ఇసుక అనుమతులు ఇవ్వడంలేదు అంటూ మండల రెవెన్యూ అధికారి చెప్పే సమాధానాలపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పలువురు విలేకరులు రెవెన్యూ అధికారినిని వివరణ అడగడంతో కేవలం ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. మంగళ వారం ప్రొద్దున నుండి సాయంత్రం వరకు ఇందిరమ్మ ఇండ్లకు ఇచ్చిన అనుమతులతో అక్రమంగా బహిరంగ ప్రదేశాల్లో ఇసుక డంపులు పోసిన ప్రదేశాలను విలేకరులతో సందర్శించి అక్రమ ఇసుక డంపులను సీజ్ చేసి ఎవరైనా అక్రమ ఇసుక రవాణాను చేపడితే కఠిన చర్యలు చేపడతామని ఇక నుండి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్లకు కావాల్సిన ఇసుక అనుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.  ఇందిరమ్మ లబ్ధి దారులు ఇక నుండి ఎవరైనా ఇసుక అనుమతుల కోసం నేరుగ మండల రెవెన్యూ కార్యాలయంలో అనుమతుల కోసం రెవెన్యూ ఇన్స్పెక్టర్ అధికారి పర్యవేక్షణ లేకుండా అనుమతులు ఇవ్వడం కుదరదని ఇసుక అనుమతులలో ఎలాంటి అవకతవకలు జరిగిన సహించేది లేదని రెవెన్యూ కార్యాలయంలో ఎవరైనా ఇసుక అనుమతులకోసం అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.