- మహారాష్ట్ర ఇసుక మాఫియా దాడి
- ఆలస్యంగా వెలుగు చూసిన వైనం
బతుకమ్మ, కోటగిరి: నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని కొడిచెర్ల ,పొతంగల్ మంజీర శివారు ప్రాంతం వద్ద గురువారం రాత్రి ఇసుక మాఫియాదారుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. సిరిపూర్ గ్రామానికి చెందిన కొంతమంది పై మహారాష్ట్రకు చెందిన ఇసుక మాఫిదారులు సుమారు 50 మంది రెండు బులెరోలో వచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత పది రోజుల క్రితం ఇదే సరిహద్దు ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగిందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. సిర్పూర్ కు చెందిన తొమ్మిది మందిపై దాడి చేయగా ముగ్గురి లో తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని కాలు, చేతులు, విరిగి పరిస్థితి విషమంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. సిర్పూర్ గ్రామ ప్రాంతానికి చెందిన కొంతమంది కొడిచెర్ల శివారు, పోతంగల్ శివారు ప్రాంతంలో వచ్చి అక్రమంగా ఇసుకను తరలించ కూడదని ఇసుక నింపుతున్న పరిస్థితి , ఇసుక తరలింపును అడ్డుకోగా ఇసుక మాఫిదారులు రెచ్చిపోయి రెండు బులెరా నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చి రాడ్లులతో విచక్షణ రహితంగా దాడి

చేశారని ఈ దాడిలో 9 మందికి గాయాలు కాగా ముగ్గురిలో ఇద్దరు పరిస్థితి దుర్భరంగా ఉండడం, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. వర్షాలు తగ్గగానే మంజీరాలో కొంచెం నీటి ప్రభావం తగ్గగానే ఇసుక మాఫిదారులు ముఖ్యంగా మహారాష్ట్ర ఇసుక మాఫియా దారులు పూర్తిగా రెచ్చిపోతున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. విచ్చలవిడిగా ప్రతిరోజు రాత్రి పూట ఇసుకను భారీగా తరలిస్తున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా అడ్డుపడితే గ్యాంగులుగా వచ్చి మారణాయుధాలతో దాడి చేసి, మహారాష్ట్ర మాఫిదారులు గుండాయిజం, రౌడిజం చేస్తున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇసుక మాత్రం ప్రతిరోజు తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్రకు తరలిపోతుందని ఆపే నాధులు కరువైరని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. తీవ్రంగా గాయాలైన వారిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

