ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయి పరిధిలో గల గౌరారం ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలలో పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పొగాకు వాడకం చేయరాదని పాఠశాల పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులను అమ్మడం నిషేధించడం జరిగిందని మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై. శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వై.శంకర్ మాట్లాడుతూ ధూమపానం (పొగ త్రాగడం) మద్యపానం (మద్యం సేవించడం) రెండూ ఆరోగ్యానికి చాలా హానికరం, ఇవి క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. వీటిని మానేయడం లేదా తగ్గించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మరియు సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుందన్నారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, స్వరపేటిక, నోరు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లతో సహా అనేక రకాల క్యాన్సర్‌లకు ధూమపానం ప్రధాన కారణం అన్నారు. గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఎంఫిసెమా వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తుంది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, ఆరోగ్య కార్యకర్త లక్ష్మి ఆశా కార్యకర్త లక్ష్మి, ఎం. ఎల్. హెచ్. పి. లు కీర్తన,మలేహ సుల్తానా,సుచరిత, ఇన్చార్ ప్రధానోపాధ్యాయులు పద్మయ్య, ఉపాధ్యాయులు విజయరామ్, వర్ధన పాల్గొన్నారు.

