రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలోని బసవేశ్వర ఆలయం పక్కన గల షాదీ ఖానా వద్ద ఆరు ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపులు నిల్వ ఉండడంతో బుధవారం ఇసుక దంపులను సీజ్ చేసినట్లు తహసీల్దార్ తారాబాయి తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.