29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు పట్టణం,మండలంలోని పలు గ్రామాల్లో, భిక్కనూరు దక్షిణ ప్రాంగణంలో   చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి  ని బుధవారం భిక్కనూరులోని పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ చత్రపతి శివాజీ మరాఠా యోధుడని, శివాజీ లాంటి వీరుడు ఉండబట్టే ఈ దేశంలో హిందూ ధర్మం ఇంకా జీవించి ఉందనిఅన్నారు. శివాజీ విరోచిత పోరాటం హిందుత్వాన్ని కాపాడడం  కోసం  చేసిన కృషి గురించి యువత తెలుసుకోవాలన్నారు. అంతకుముందు పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు ఆయా పార్టీల నాయకులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article