27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఒకే ఉద్యోగి 10  రోజుల వ్యవధిలో రెండుసార్లు ట్రాన్స్ ఫర్

Must read

📰 Generate e-Paper Clip

  • ఒక ప్లేస్ నుంచి ట్రాన్స్ ఫర్
  •  ఇంకో ప్లేస్ నుంచి రిలీవింగ్ ఆర్డర్
  •  ఈ తప్పిదాలు పై అధికారులు చేస్తున్నారా..?

 కామారెడ్డి, బతుకమ్మ: ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డి నుంచి ఎలాంటి బదిలీ ఉత్తర్వులు లేకున్నా రిలీవ్ చేశారు. అధికారుల లోపమా..? ఏమైనా కాసులకు కక్కుర్తి పడ్డారా..? 18 జులై కౌన్సిలింగ్ లో ఆప్షన్ తీసుకొని ప్రభుత్వజనరల్ ఆస్పత్రి నుండి ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డికి 21 జులై కి ఆఫీస్ సూపరింటెండెంట్ గా విధుల్లో చేరాడు. మళ్ళీ తిరిగి 27 జులై అదే ఉద్యోగికి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సిరిసిల్ల నుండి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిద్దిపేటకు బదిలీ అయినట్టు  ఉత్తర్వులు జారీ చేశారు.

కామారెడ్డి మెడికల్ కళాశాల నుండి రిలీవింగ్ ఆర్డర్..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాధారణ పరిధిలో భాగంగా ఒక ఉద్యోగి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రాజన్న సిరిసిల్ల నుండి ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డిలో 18 న కౌన్సిలింగ్లో ఆప్షన్ తీసుకొని 21జూలై 2024రోజున ఆఫీస్ సూపరింటెండెంట్ గా  విధులలో చేరారు. మళ్లీ తిరిగి 27న అదే ఉద్యోగికే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రాజన్న సిరిసిల్ల నుండి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిద్దిపేటకు బదిలీ అయినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆ సమయంలో ఆ ఉద్యోగి ప్రభుత్వ వైద్య కళాశాలలో వారం రోజులు పనిచేశారు.  ఉత్తర్వులు వెలువడగానే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సిద్దిపేట నందు విధులలో చేరారు. అతనికి ఇచ్చిన ఉత్తర్వులు మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్దిపేటకు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డి నుండి రిలీవింగ్ ఆర్డర్  ఇవ్వడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రాజన్న సిరిసిల్ల నుండి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిద్దిపేటకు ఉత్తర్వులు రాగా ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డి నుండి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిద్దిపేటకు రిలీవ్ చేయడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగి, ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డి వారు ఇద్దరు తప్పిదం చేశారు. దీనిపై స్పందించి ఉన్నతాధికారులు తగు చర్య తీసుకోవాలని ఉద్యోగస్తులు గుసగుసలాడుతున్నారు.

More articles

Latest article