27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సాయి ఈశ్వర చారి బలిదానం వృథా పోదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ:   బీసీల రిజర్వేషనన్ల సాధన కోసం అమరుడైన    సాయి ఈశ్వరచారి మృతికి  నిరసనగా బీసీ నాయకులు శనివారం నగరంలో నిరసన తెలిపారు. నగరంలోని  హనుమాన్ జంక్షన్ విగ్రహాల పార్కులో గల పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘం జిల్లా నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. 56% ఉన్న బీసీలకు ఈ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే కొందరు అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారని  ఆరోపించారు.  దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాన్ని తట్టుకోలేక  సాయి ఈశ్వర చారి పెట్రోల్ పోసుకొని ఆత్మహుతి చేసుకోవడం తీవ్రంగా కలిచి వేసిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. సాయి ఈశ్వర చారి  బలిదానం వృథా పోదని అన్నారు.  తెలంగాణ ఉద్యమంలో మరియు ఇప్పుడు బీసీ ఉద్యమంలో మొదటగా ఆత్మార్పణ చేసింది విశ్వబ్రాహ్మణులేనని, నాటి తెలంగాణ స్ఫూర్తితో నేటి బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సత్య ప్రకాష్ అన్నారు. ప్రభుత్వాలు దిగివచ్చి మేమెంతో మాకెంత వాటా ఇచ్చేవరకు బీసీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్ అన్నారు. కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, కరిపే రవీందర్, సత్య ప్రకాష్, బగ్గలి అజయ్, శ్రీనివాస్, చంద్రకాంత్, సదానంద్, సురేందర్, గంగాధర్, గోపాలకృష్ణ, నగేష్, దయానంద్, వెంకటేష్, లక్ష్మణాచారి, మురళి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article