సాయి ఈశ్వర చారి బలిదానం వృథా పోదు
నిజామాబాద్, బతుకమ్మ: బీసీల రిజర్వేషనన్ల సాధన కోసం అమరుడైన సాయి ఈశ్వరచారి మృతికి నిరసనగా బీసీ నాయకులు శనివారం నగరంలో నిరసన తెలిపారు. నగరంలోని హనుమాన్ జంక్షన్ విగ్రహాల పార్కులో గల పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘం జిల్లా నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. 56% ఉన్న బీసీలకు ఈ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే కొందరు అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాన్ని తట్టుకోలేక సాయి...