27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలో  రఘునాథ చెరువు వద్ద సోమవారం మహిళా ఆడపడుచులు అంగరంగ వైభవంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలందరూ బతుకమ్మలను ఒక్క దగ్గరగా చేర్చి చప్పట్లు కొడుతూ ఆటపాటలతో పాటలు పాడుతూ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ సందర్భంగా పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యం పెట్టి, పూజలు చేస్తారు. అనంతరం రాత్రి వరకూ ఆటపాటలతో అమ్మవారిని కొలిచి, బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Saddula Bathukamma celebrations in full swing

Saddula Bathukamma celebrations in full swing

More articles

Latest article