ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలో రఘునాథ చెరువు వద్ద సోమవారం మహిళా ఆడపడుచులు అంగరంగ వైభవంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలందరూ బతుకమ్మలను ఒక్క దగ్గరగా చేర్చి చప్పట్లు కొడుతూ ఆటపాటలతో పాటలు పాడుతూ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ సందర్భంగా పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యం...