27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం.హరిత

Must read

📰 Generate e-Paper Clip

  • శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు

 

సిరిసిల్ల జిల్లా, బతుకమ్మ  : రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా ఎం. హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి రాగా, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్ లో కలెక్టర్ ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాంరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article