26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కౌలాస్ కోటను సందర్శించిన ఎస్ పి. సింధు శర్మ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎల్లమ్మ మందిరం లో పూజలు చేసిన ఎస్. పి.

బతుకమ్మ, బిచ్కుంద 

కౌలాస్ కోట అందాలు, కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని కామారెడ్డి జిల్లా ఎస్ పి. సింధు శర్మ అన్నారు. ఆమె ఆదివారం కౌలాస్ కోటను సందర్శించారు. కోటలో మూడు గంటల పాటు తిరిగి పురాతన నిర్మాణాలు, మందిరాలను, కట్టడాలను పరిశీంచారు. కౌలాస్ కోట చారిత్రక వివరాలు,కోటలో మూడు గంటల పాటు కలియ తిరిగి తొమ్మిది గజాల ఫిరంగి, హనుమాన్, మందిరం, రామాలయం, సరస్వతి మాత, వెంకటేశ్వరా మందిరం,పట్టే మంచం, తామర కొలను, మల్లికా బురుజు, ఆయుధ గారాలు, ధన్యగారాలు, కంధకాలు, తదితర వాటిని పరిశీలించారు.

S. P. who visited Koulas fort. Sindhu Sharma

కోట వెలుపల ఉన్న అష్ట భుజ మాత మందిరాన్ని సందర్శించి పూజలు చేసి తీర్త ప్రసాదాలు స్వీకరించారు.కార్యక్రమం లో కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి ,ట్రైనీ ఐ పి ఎస్., బాన్స్వాడ, ఎల్లారెడ్డి డి ఎస్ పి లు, బిచ్కుంద సీఐ జగడం నరేష్ తో పాటు ఇతర సిఐలు, ఎస్ఐలు , సిబ్బంది పాల్గొన్నారు.

S. P. who visited Koulas fort. Sindhu Sharma

 

More articles

Latest article