29.7 C
Hyderabad

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

Must read

📰 Generate e-Paper Clip

… ఇద్దరికి గాయాలు

కామారెడ్డి, బతుకమ్మ : 

కామారెడ్డి జిల్లా గోపాల్‌పేట్ మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారిని మెరుగైన చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదంలో గాయపడిన వారిలో మూడ్ మోతి ఆమె భర్త బిచ్చు ఇద్దరూ మహాదేవుని గడ్డ తండా, మెల్లకుంట గ్రామపంచాయతీకి చెందినవారుగా గుర్తించారు.

RTC bus out of control

ప్రత్యక్ష  సాక్షుల కథనం ప్రకారం, గోపాల్‌పేట్ మండల కేంద్రం సమీపంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బిచ్చు, మోతిలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

More articles

Latest article