30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

శబరిమల ఆలయానికి 15 రోజుల్లో రూ.92 కోట్లు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈఏడాది మండల- మకరవిలక్కు సీజన్ లో తొలి 15 రోజుల్లో రూ.92 కోట్లు ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. గతేడాది ఇదే సీజన్ లో రూ. 69 కోట్ల ఆదాయం రాగా, ఈఫా ఆదాయం 33.33 శాతం పెరిగింది. ఈఏడాది అయ్యప్ప ప్రసాదం విక్రయాల నుంచి రూ. 47 కోట్లు సమాకూరినట్లు టీడీబీ పేర్కొంది. హుండీ ఆదాయం గతేడాదిలో పోల్చుకుంటే 18.18 శాతం పెరిగింది. గతేడాది మండల- మకరవిలుక్కు సీజన్ నుంచి నవంబర్ 30 వరకు దాదాపు 13 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు.

More articles

Latest article