అంతర్రాష్ట్ర డ్రగ్ పెడలింగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టు
వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య
నిజామాబాద్, బతుకమ్మ : అంతర్రాష్ట్ర డ్రగ్ పెడలింగ్ రాకెట్ ముఠా గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. వీరి నుంచి రూ. 3 కోట్ల విలువైన అల్ప్రా జోలంను స్వాధీనం చేసుకున్నారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సీపీ సాయి చైతన్య మంగళవారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఈకేసులో ప్రధాన నిందితులు అమర్ సింగ్, బాబు బస్వరాజ్ లు కెమికల్ ఇండస్ట్రీ పేరిట అనుమతి తీసుకొని అల్ర్పాజోలం తయారు చేసి రవాణా చేస్తున్నారు. వీరి నుంచి లక్ష్మణ్ గౌడ్ అల్ర్పాజోలం తీసుకొని కల్లు డిపోలకు సప్లయి చేస్తున్నాడు. ఈక్రమంలో బోధన్ మండలం సాలూర గ్రామంలో 2.5 కిలోల అల్ర్పాజోలం డెలివరీ ఇస్తూ.. ఈనెల 15/16న లక్ష్మణ్ గౌడ్ పోలీసులకు పట్టుబట్టాడు. అనంతరం పోలీసులు లక్ష్మణ్ గౌడ్ తో పాటు అమర్ సింగ్, బాబు బస్వారాజ్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. విచారణపై జరిపిన పోలీసులు వీరి చెప్పిన వివరాలతో అల్ప్రా జోలం, నగదు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని ఉమెర్గా నుంచి షోలాపూర్ వరకు రూ. 3 కోట్ల విలువైన అల్ప్రా జోలం స్వాధీనం చేసుకున్నారు. సతారాలో రూ12,00,000, సతారా లో ఎంఐడీసీ కంపెనీ కార్యాలయంలో రూ 4 కోట్ల విలువైన కెమికల్స్, ఓ కారును బోధన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా పోలీసులను సీపీ అభినందించారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని సీపీ పిలుపునిచ్చారు.