బతుకమ్మ,ఏర్గట్ల: రైతులకు రావాల్సిన రైతు భరోసా 25 వేల కోట్ల డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లోకి వెయ్యాలని ఏర్గట్ల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగందుల రాజాపూర్ణనందం,మాజీ ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి డిమాండ్ చేసారు.పార్టీ కార్యకర్తలతో కలిసి వారు ఏర్గట్ల తహసీల్దార్ మల్లయ్యకు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్బంగా పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ.. కేసీఆర్ రాష్ట్ర రైతుల మొహాల్లో చిరునవ్వు చూడానికి, రైతులకు కష్టలు రాకుండా, అప్పుల పాలు గాకుండా ప్రతి పంట సీజన్ ల్లో రైతు బందు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి రైతులకు అండగా నిలిచారాని, కాని అబద్దాలు, మోసపురితమైన ప్రచారం చేసి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రెండుసార్లు రైతు బంధు ఏగగొట్టి ఇప్పుడు ఎలక్షన్ కోసం ఖాళీ రూ.19 వేల కోట్లు మాత్రమే వేశారని మూడుసార్లు రైతుల ఖాతాల్లో వెయ్యవల్సిన రైతు బందు డబ్బులు మొత్తం రూ. 40 వేల కోట్లు కాగా రూ.19వేల కోట్లు వేసి చేతులు దులుపుకున్నారని, ఇదంతా తెలంగాణ ప్రజానీకం, రైతులు గమనిస్తూన్నారని కాంగ్రెస్ పార్టీ కి ఇక నూకలు చెల్లినవని అయన అన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దేవుడు నర్సయ్య, సొసైటీ చైర్మన్ లు బర్మ చిన్న నర్సాయ్య, పెద్ద కాపు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఏంపిటిసి సభ్యుడు డాక్టర్ మధు,పార్టీ నాయకులు అంజి రెడ్డి,బద్దం శ్రీనివాస్ రెడ్డి, బద్దం ప్రభాకర్,బద్దం హన్మాండ్లు, లక్కం నర్సయ్య,కొలిప్యాక శ్రీనివాస్ రెడ్డి, కూతురు చిన్న సాయన్న, మేర తిరుపతి, గన్నరపు రాజేశ్వర్, ఏలేటి బాల్ కిషన్ రెడ్డి, శ్యాం రెడ్డి, రొక్కేడ మోహన్, సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కుశ లింబాద్రి, అట్ల పోషన్న,వార్డు మెంబర్ శ్రీనివాస్, ప్రవీణ్ యాదవ్, ఇమామ్, నరేందర్ రెడ్డి,అనుక్ గంగాధర్, తదితరులు, పాల్గొన్నారు.
