హైదరాబాద్, బతుకమ్మ: నెలకు రూ 700 కోట్లు కెటాయించి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం మేరకు రూ.180 కోట్ల మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ ఈ నెలాఖరులోగా మిగిలిన రూ.520 కోట్ల బిల్లులను విడుదల చేయాలని జేఏసీ నాయకులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి కోరారు. వీరిలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, రాష్ట్ర కార్యదర్శి ఎ.సింహాచలం, గురుకుల విభాగాల నాయకులు లివిన్, రాంబాబు, మహేష్, సురేంద్ర ఉన్నారు.
