26.2 C
Hyderabad
Monday, August 3, 2026

క్వింటాల్ పసుపునకు రూ.15వేలు చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సరైన ధర లేక పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారని, క్వింటాల్ కు రూ.15వేల ధర కల్పించాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. జక్రాన్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లిలో ఆదివారం ఆయన విలేకరులో మాట్లాడారు. మార్కెట్లో మధ్య దళారీలువ్యాపారస్తులు సిండికేట్ గా మారి ధరలను తగ్గించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు సాగుకోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి చేతికిరాక రైతులు నష్టపోతున్నారని, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ ధరలు ఇక్కడ రైతులకు రావడం లేదన్నారు. రైతులు మోసాలకు గురికాకుండా చూడటంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. రోజులకొద్దీ మార్కెట్లో కుప్పలు పోసుకొని ఎదురుచూస్తున్నా రైతుల పసుపును కొనుగోలు చేయాలని, ధాన్యం మాదిరిగానే క్వింటాల్ పసుపునకు వెయ్యి రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను నిలువునా ముంచుతున్న వ్యాపారస్తులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ చేయాలనీచక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వమే తెరిపించి నడిపించాలన్నారు. సమావేశంలో దేవస్వామి, జేపీ గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article