క్వింటాల్ పసుపునకు రూ.15వేలు చెల్లించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సరైన ధర లేక పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారని, క్వింటాల్ కు రూ.15వేల ధర కల్పించాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. జక్రాన్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లిలో ఆదివారం ఆయన విలేకరులో మాట్లాడారు. మార్కెట్లో మధ్య దళారీలువ్యాపారస్తులు సిండికేట్ గా మారి ధరలను తగ్గించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు సాగుకోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి చేతికిరాక రైతులు నష్టపోతున్నారని, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ ధరలు ఇక్కడ రైతులకు...