32.2 C
Hyderabad

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. ఎల్లారెడ్డి మున్సిపల్ లో వర్షాల కారణంగా దెబ్బతిన్న లింక్ రోడ్లు, డ్రైన్స్ మరమ్మతుల నిర్మాణం కోసం  రూపాయలు 6 కోట్లు మంజురయ్యారు. ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద విశాలమైన పార్క్ నిర్మాణం కోసం రూపాయలు 3 కోట్లు మంజూరయ్యాయి. ఎల్లారెడ్డి మున్సిపల్ వ్యాపార సముదాయానికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూపాయలు 5 కోట్లు మంజురు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం 1కోటి రూపాయలు  ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేశారు.

More articles

Latest article