24.2 C
Hyderabad

అస్తవ్యస్తంగా మారిన రోడ్లు

Must read

📰 Generate e-Paper Clip

  • రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు

 

రుద్రూర్ (వర్ని), బతుకమ్మ  : వర్ని మండలం తగిలేపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు దుస్థితి గుంతలు,  గుంతలుగా ఏర్పడి అస్తవ్యస్తంగా తయారైందని, అధికారులు స్పందించి వెంటనే రోడ్డు వేయించాలని ఆదివారం వర్ని మండల కేంద్రంలోని తగిలేపల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై బైఠాయించి బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తదిలేపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా మారిందని, ఈ రోడ్డు దుస్థితి గురించి అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిలేపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డును వేయించాలని వారు కోరారు.

Roads that have become chaotic

More articles

Latest article