30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రేపటి నుండి ధర్పల్లి వైపు వెళ్లే రోడ్డు మూసివేత…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . లింగాపూర్ వాగు వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జి పనుల పునః ప్రారంభం

 

. . . వేసవికాలంలో చేయాల్సిన పనులను వర్షాకాలంలో మొదలుపెట్టడంపై పలువురు అసంతృప్తి..

 

. . . జులై 25 వరకు రాకపోకలు నిలిపివేత

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల పరిధిలోని లింగాపూర్ వాగు వద్ద ఇటీవల నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద మట్టి రోడ్డు కృంగిపోవడంతో పనులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు పునః ప్రారంభం చేస్తున్నారని ఇందల్వాయి ఎస్సై సుమలత తెలిపారు. దీంతో జులై 2 నుండి జులై 25వ తేదీ వరకు పనులు కొనసాగుతాయని ప్రయాణికులు గమనించి తిరుమల్ పల్లి నుండి రాంపూర్ లోలం ఎల్లారెడ్డిపల్లి మీదుగా ధర్పల్లి వెళ్లాలని ఆమె సూచించారు. ప్రయాణికులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం సహకారం అందించాలన్నారు. కానీ వేసవి కాలంలో చేయాల్సిన పనులను వర్షాకాలం ప్రారంభమైన తర్వాత సంబంధిత కాంట్రాక్టర్ పనుల పునః ప్రారంభంపై మండలానికి చెందిన పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందల్వాయి నుండి ధర్పల్లి సిరికొండ భీమ్గల్ వరకు ఏకైక మార్గం అయినా ధర్పల్లి రోడ్డును సుమారు 25 రోజులు మూసి వేయడం పై పలువురు ప్రయాణికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వేసవికాలంలో పనులు పూర్తి చేయవలసిందిగా ప్రభుత్వాలున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే పనులు నత్త నడక నా కొనసాగుతున్నాయని ఇందల్వాయి ధర్పల్లి సిరికొండ మండలం చెందిన పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తిచేసే విధంగా పర్యవేక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

More articles

Latest article