– కారు, ఆటో ఢీ ఆరుగురికి గాయాలు
బతుకమ్మ, నవీపేట్ : కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన నవీపేట్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. నవీపేట్ మండల కేంద్రంలో సాటపూర్ రోడ్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద గల స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో ట్రాలీ ని కారు ను వెనక నుండి వేగంగా ఢీ కొట్టడంతో ఆటో ట్రాలీలో ఉన్న ఐదుగురికి, ఢీ కొట్టిన కారు సైతం పల్టి కొట్టడం తో కారు డ్రైవర్ కి సైతం గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు రెంజల్ మండలం సాటాపూర్ నుండి వస్తున్న ఆటో ట్రాలీని వీరన్న గుట్ట నుండి వస్తున్న కారు స్పీడ్ బ్రేకర్ వద్ద వెనక నుండి వేగంగా ఢీ కొనడంతో ట్రాలీ లో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 5 గురు, కారు డ్రైవర్ రవి గౌడ్ కు గాయాలు కావడంతో పోలీసులు క్షతగాత్రులను జిల్లా కేంద్రం లోని ఆసుపత్రికి తరలించారు.
