. . . మేరు సంఘ భవనాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
మేరు సంఘం అంటేనే ఐక్యమత్యానికి మారు పేరని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని నిజామాబాద్ మేరు సంఘం భవన పునః ప్రారంభనికి ముఖ్యఅతిథిగా నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాదు మేరు సంఘం సంఘం పెద్దలతో గత ముప్పై ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. సంఘం పెద్దలు ఐక్యమత్యంతో సుందరమైన భవనాన్ని నిర్మించి భావి తరాలకు ఇవ్వడం మేరు కులస్తులు అందరు గర్వించదగ్గ విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన ద్వారా చేతి వృత్తుల, కుల వృత్తులను ప్రోత్సాహించడం జరుగుతుందని అన్నారు, మేరు సంఘ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తారని అన్నారు. నూతనంగా ఎన్నికైన వివిధ తర్పల సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల కార్యవర్గాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యేకి మేరు సంఘం పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గడుగు రోహిత్, మేరు సంఘ కుల పెద్దలు మేరు సంఘం జిల్లా అధ్యక్షులు సోమ హనుమంత్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు గంగ కిషన్, కొట్టురు దేవి దాస్ , జిల్లా కో శాధికారి చంద్రకాంత్, మేరు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

