- తప్పిన పెను ప్రమాదం
బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా ఏడపల్లి మండలం ఎమ్మెస్సి ఫారం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న గూడ్స్ ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో నష్టపోయిన వాహనాలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.


