భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పిప్రి, బాబా నగర్, జగిర్యాల్ గ్రామాలల్లో రిస్క్ బేస్డ్ ఇంటర్నల్ ఆడిట్ టీం పర్యటించింది. ఈ సందర్శనలో భాగంగా పిప్రి గ్రామంలోఉపాది పథకంలో భాగంగా ఉపాధి కూలీలతో నిర్మించిన నీటి నిలువ కందకాల పనులను, ప్లాంటేషన్, ఇంకుడు గుంతల నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం బాబా నగర్ గ్రామంలో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, సిసి రోడ్డు పనులను పరిశీలించి, ఆయా పనులకు సంబంధించిన గ్రామపంచాయతీ ఉపాధి హామీ రికార్డులను వారు తనిఖీ చేశారు. జగిర్యాల్ గ్రామంలో కమ్యూనిటీ ప్లాంటేషన్. అంతర్గత రోడ్లలో నాటిన మొక్కల ప్లాంటేషన్, పశువుల షెడ్డు పనులను పరిశీలించారు. కేంద్ర నిధులతో మండలంలో చేపట్టిన పనుల పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తంచేసినారు.

రికార్డుల నిర్వహణ బాగుందని ప్రశంసించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్ అధికారులు సాధన మేడం, స్మిత, జిల్లా అధికారులు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఓంపాల్, జిల్లా అంబుడ్స్ మెన్ శ్రీనివాస్, మండలాధికారులు ఎంపీ ఓ జావిద్ ఆలీ, ఏపీవో జీ నరసయ్య, పంచాయతీరాజ్ ఏఈలు విక్రమ్, మేఘన, ఉపాధి హామీ ఇంజనీరింగ్ పూర్ణచంద్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు,సంబంధిత పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

