28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

హక్కులను పోరాడి సాధించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హక్కుల కొరకు బిక్షమెత్తుద్దని పోరాడి సాధించుకోవాలని.. అనే నినాదాన్ని చాటి చెప్పిన మహనీయుడని జగ్జీవన్  రాం అన్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు.  జగ్జీవన్ ఆశయాలు కొనసాగిస్తాం,  కొనసాగిస్తామని తెలిపారు. భారత మాజీ ఉప ప్రధానమంత్రి,, కాంగ్రెస్ జాతీయ వాది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , సామాజిక హక్కుల కొరకై ఉద్యమించిన ఉద్యమ సూర్యుడు , భారత స్వతంత్ర సమరయోధుడు, జగ్జీవన్ రావు 39 వ వర్ధంతి సందర్భంగా నివాళులు జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరుగు పైడి  మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నిజామాబాద్ జిల్లా ఇంచార్జి, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికేల పోశెట్టి మాదిగ, ఎమ్మార్పిఎస్ పట్టణఅధ్యక్షులు పెద్దగిరి మహేష్ మాదిగ, ఎంఎస్పీ పట్టణ అధ్యక్షులు శీలంయాదగిరి మాదిగ, సుధాకర్, నగేష్, రమేష్, సురేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article