29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : ప్రస్తుత 2024-25 సంవత్సరం సి.ఎం.ఆర్. కోసం రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం సి.ఎం.ఆర్. కోసం మిల్లుల యజమానులు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు వెంటనే సమర్పించాలని తెలిపారు. ఈ సంవత్సరం ధాన్యం కేటాయింపులు జరుగుతున్న దృష్ట్యా మిల్లర్లు గ్యారంటీ లను, అగ్రిమెంట్లు అందజేయాలని తెలిపారు. గత 2021-22, 2022-23 సంవత్సరాలకు సంబంధించిన పెండింగులో ఉన్న సి.ఏం.ఆర్. వెంటనే సరఫరా చేయాలనీ లేనిచో డిఫాల్ట్ అయిన మిల్లులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహ రావు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

Rice millers have to submit bank guarantee and agreements

More articles

Latest article