బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన గాండ్ల నాగయ్య, అనే వ్యక్తి ఇటీవల యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. ఇట్టి విషయం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గాండ్ల నాగయ్య కుటుంబానికి 5000/ రూపాయలు ఆర్థిక సహాయం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా నాగయ్య కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్ ముదిరాజ్, మండల మైనార్టీ ప్రెసిడెంట్ మునీరొద్దీన్, సున్నపు శ్రీను, రొక్కేడ సంజీవ్, ఎం డి అన్వర్, నరసయ్య, వడ్ల రవి, గడ్డం గంగారం, చిరంజీవి, పాల్గొన్నారు.
