రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ప్రస్తుత 2024-25 సంవత్సరం సి.ఎం.ఆర్. కోసం రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం సి.ఎం.ఆర్. కోసం మిల్లుల యజమానులు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు వెంటనే సమర్పించాలని తెలిపారు. ఈ సంవత్సరం ధాన్యం కేటాయింపులు జరుగుతున్న దృష్ట్యా మిల్లర్లు గ్యారంటీ లను, అగ్రిమెంట్లు అందజేయాలని...