- వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : పరిశోధనలతోనే సమాజంలో విప్లవాత్మకమైన మార్పుల వస్తాయని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో పరిశోధన పత్రాల తయారీ అనే అంశంపై విభాగాధిపతి,కార్యాశాల కన్వీనర్ ఆచార్య సిహెచ్ ఆంజనేయులు అధ్యక్షతన మంగళవారం కార్యశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో క్షేత్రస్థాయి పరిశోధనలే సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాయన్నారు. యువత నూతన వినూతన మార్పుల కనుగుణంగా పరిశోధనలు చేయాలన్నారు. ఈక్రమంలో విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు కేంద్రంగా వర్ధిల్లుతాయన్నారు. ఆధునిక ప్రపంచంలో అద్భుతమైన మార్పులు విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనల వల్లనే సాధ్య మౌతాయన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి మాట్లాడుతూ నూతన పరిశోధనలతో రోజురోజుకు పెరిగే సవాళ్లను అధిగమించాలన్నారు. సామాజిక శాస్త్రాలలో సమాజమే ప్రయోగశాలగా భావించి పరిశోధనలు చేయాలన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల మాట్లాడుతూ చాట్ జిపిటి, గూగుల్, డీప్ సీక్ లాంటివి మానవ పరిశోధనలకు సరికావున్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ లు ఆచార్య కైసర్ మహమ్మద్, ఆచార్య అపర్ణ డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ వాణి, డాక్టర్ కిరణ్ రాథోడ్ ల తో పాటు వివిధ కళాశాలల మేనేజ్మెంట్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

