పరిశోధనలతోనే సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు
వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : పరిశోధనలతోనే సమాజంలో విప్లవాత్మకమైన మార్పుల వస్తాయని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో పరిశోధన పత్రాల తయారీ అనే అంశంపై విభాగాధిపతి,కార్యాశాల కన్వీనర్ ఆచార్య సిహెచ్ ఆంజనేయులు అధ్యక్షతన మంగళవారం కార్యశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో క్షేత్రస్థాయి పరిశోధనలే సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాయన్నారు. యువత నూతన వినూతన మార్పుల...