కామారెడ్డి, బతుకమ్మ :


కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ విజయవసభ లో నూతనంగా గెలిచిన సర్పంచ్లకు మంగళవారం సన్మానించారు. సర్పంచ్ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నాలుగింటికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు గెలుపును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహుమతిగా ఇవ్వాలన్న లక్ష్యంతో అందరూ ఐకమత్యంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, షబ్బీర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
