26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కామారెడ్డిలో వైభవంగా ఇందిరమ్మ విగ్రహావిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

. . . తరలివచ్చిన రాష్ట్ర ప్రముఖులు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని, భారత రత్న ఇందిరాగాంధీ నూతన విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ సేవలను స్మరిస్తూ, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పై ఉందని, ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం కామారెడ్డి రాజకీయ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్, గ్రంథాలయ చైర్మన్ మధ్దె చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ తో పాటు జిల్లా సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article