. . . 28,650 నగదు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
సిర్నాపల్లి శివారులో పేకాట స్థావరం పై సీసీఎస్ టీం మెరుపు దాడి చేసింది. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏ.సీ.పీ ఇంచార్జ్ మస్తాన్ ఆలీ సూచనల మేరకు సిఐ సాయినాథ్ , ఎస్.ఐ గోవింద్ సిబ్బంది కలిసి నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నాపల్లి శివారులో పేకాట స్థావరం పై దాడి చేశారు. ఈ దాడి లో ఆరుగురు గురు పేకాట రాయుళ్ళు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 6 సెల్ ఫోన్స్, 28,650 నగదు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం నవీపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కు అప్పగించారు.
