27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యాలయాలను దేవాలయాలుగా మారుస్తున్న రేవంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

  రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

బతుకమ్మ,మోర్తాడ్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు అమలవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాల నందు కామన్ డైట్ పోస్టర్ ను ఆవిష్కరించి హ్యాండ్ బుక్ విడుదల చేయడం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపిన డ్రైనేజీ, ఎక్సాస్ట్ ఫ్యాన్ ల సమస్యను పరిష్కరిస్తామని, వంటగదికి కావాల్సిన ఎక్సస్ట్ ఫ్యాన్ లను సొంత నిధులతో అందిస్తానని మానాల మోహన్ రెడ్డి తెలిపారు.అదేవిధంగా పాఠశాలకు ప్లే గ్రౌండ్ చదును చేయించాలని కాంగ్రెస్ నాయకులతో మాట్లాడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Revanth Reddy is turning schools into temples

ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో గతంలో ఉన్న పాలకులు ఏరోజు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే డైట్ మరియు కాస్మెటిక్ చార్జీలను పెంచలేదని ఎనిమిది సంవత్సరాలుగా ఉపాధ్యాయులు తమకు వచ్చే చాలీచాలని నిధులతో విద్యార్థులకు సరిపడే భోజనం అందించలేక ఇబ్బందులు పడ్డారని విద్యార్థులు పౌష్టిక ఆహారం తీసుకొని శారీరకంగా మానసికంగా బలంగా ఉన్నప్పుడే విద్యను సరిగ్గా అభ్యసించగలరని విద్యార్థులు బాగా చదువుకుంటేనే భవిష్యత్తు తరాలలో రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి కృషి చేస్తారని నమ్మిన రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు పోషక ఆహారం అందించాలని డైట్ చార్జీలను 8 సంవత్సరాల తర్వాత సుమారు 40% పెంచడం జరిగిందని అదేవిధంగా కాస్మెటిక్ చార్జీలను 16 సంవత్సరాల 200 శాతం పెంచడం జరిగిందని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు.

Revanth Reddy is turning schools into temples

పెరిగిన డైట్ మరియు కాస్మెటిక్ చార్జీలు అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలో వర్తిస్తాయని,దీని కోసం సంవత్సరానికి ప్రభుత్వానికి 470 కోట్ల అదనపు భారం పడుతుంది అని తెలిసిన దీని ద్వారా దాదాపు 8 లక్షల మంది ప్రయోజనం పొందుతారు అని ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచడం జరిగిందని,పేద వర్గ పిల్లలకు ఉన్నత విద్య కొరకు,ప్రపంచ స్థాయి విద్య,అన్ని మౌలిక సదుపాయాలు అందించడం కోసం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తుంది అని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు.దానిలో భాగంగా మొదటి, రెండవ విడుతలుగా 54 స్కూల్ లకు అనుమతులిచిందని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఆహార భద్రతను నిర్ధారించడానికి,ఆహార కలుషితన్ని నివారించడానికి,విద్యార్థులకు పోషక అవసరాలు తీర్చడానికి ఆహార భద్రత కోసం టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఒకే తరహాలో ఆహారం అందించడం కోసం కామన్ డైట్ పోస్టర్, హ్యాండ్ బుక్ ను అందించిందని, పాఠశాలలు ఏ విధంగా ఆహారం తయారు చేయాలో  వడ్డించే పద్ధతులు, కిచెన్ శుభ్రంగా ఉంచుకోవడం వంటి పడతుల కొరకు హ్యాండ్ బుక్ ను ప్రతి పాఠశాలకు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో mro సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాములు,పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్,డిసిసిబి డైరెక్టర్ భూమన్న,ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్,రంజిత్,నవీద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అడెం గంగా ప్రసాద్,జిల్లా కార్యదర్శి గోపి,సీనియర్ నాయకులు లడ్డు గంగాధర్,మోర్తాడ్ టౌన్ అధ్యక్షులు అశోక్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమా రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మనోజ్,మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నీరజ్,అర్గుల్ రమేష్,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

Revanth Reddy is turning schools into temples

More articles

Latest article