- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైద్రాబాద్, బతుకమ్మ: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏడాది అయినా నాగార్జున సాగర్ డ్యాం సీఆర్పీఎఫ్ అధీనంలోనే ఉంది.. ప్రాజెక్టును ఇప్పటికీ తెలంగాణ అధీనంలోకి తేలేదు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి సమీక్ష సమావేశాలు బుధవారం హైద్రాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతు… తెలంగాణ నీళ్ల మీద రేవంత్ రెడ్డి ఆయన గురువైనా చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేయొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రేవంత్ సీఎం అయిన తర్వాత ఆరు నెలల పాటు ఒక్క ప్రాజెక్టు లో స్పూన్ మట్టి కూడా తియ్యలేదు అని గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ. 2500 ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. మహాలక్ష్మీ కింద రూ. 2500 ఇవ్వడంతో పాటు గత 12 నెలల కాలానికి గానూ బాకీ పడ్డ రూ 30 వేలు చెల్లించాలి అని ప్రభుత్వాని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ ను రూ .4 వేలకు పెంచాలి.. ఇప్పటి వరకు పెంచని కారణంగా బాకీ పడ్డ రూ. 24,000 వేలు కూడా చెల్లించాల్సిందే అని ఈ విషయంలో ప్రజల పక్షాన పోరాడుతాం అని పేర్కొన్నారు.