26.2 C
Hyderabad
Monday, August 3, 2026

జాతీయస్థాయిలో రగ్బీ ఆటకు శ్రీ భాషిత విద్యార్థి ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలలో ఏడవ తరగతి చెందిన టి.సాత్విక్ శనివారం  మహబూబ్ నగర్ లో జరిగిన 68 వ ఎస్జీఎఫ్ఐ జాతీయస్థాయి అండర్ 14 రగ్బి ఆటలో జాతీయస్థాయిలో ఎంపికైనట్లు శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ విద్యార్థులకు ఆటలు చదువులో  భాగమని చెప్పారు.  అంతేకాకుండా ఆటల వలన శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు అని అన్నారు. అనంతరం జాతీయస్థాయిలో ఎంపికైన విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పి ఈ టి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article