హైదరాబాద్, బతుకమ్మ : ’పల్లె బాట‘ పేరుతో డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రతి రోజూ రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం గ్రామాల్లో 1,01,899 పనులను అధికారులు సిద్ధం చేశారు. పంచాయతీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ పల్లెబాట పట్టడం కీలక నిర్ణయమని విశ్లేషకులు చెబుతున్నారు.
